సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యా ణ్ అన్న యోజన (పీఎం జీకేఏవై ) కింద ఉచిత బియ్యం పం పిణీని మరోమూడునెలలు పొడిగించింది. వచ్చే 3నెలలు పండుగలు ఉండటం తో పేదలకు ఆర్థిక బాధలు లేకుండా ఆహారధాన్యాలను ఉచితంగా అందిం చాలని నిర్ణయించింది. గత ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2022 వరకు.. మొత్తం 6 దశలలో మొత్తం 25 నెలల పాటు ఉచితం గా బియ్యం పంపిణీ చేసింది. తాజగా పీఎం జీకేఏవై 7వ దశలో భాగంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జాతీయ ఆహార భద్రత (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డుదారులకు ఉచితంగా బియ్యం ఇవ్వ నుంది. దేశవ్యా ప్తంగా కార్డులోని ఒక్కో వ్య క్తికి ఐదుకిలోల చొప్పు న 122 లక్షల టన్నుల బియ్యాన్నిపంపిణీ చేయనుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1.45 కోట్ల రేషన్ కార్డుల్లో 88 లక్షల కార్డులనే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఎంపిక చేసి ఆ కార్డులకే ప్రతినెలా కేంద్రం బియ్యం 5 కిలోల చొప్పున ఇస్తుండగా మిగిలిన 57 లక్షల కార్డులకు జగన్ సర్కార్ సొం త ఖర్చులతో మొత్తం అందరికి సార్టెక్స్ బియ్యం అందిస్తున్నట్లు ప్రకటించింది.మరోవైపు ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని అన్ని కార్డులను ఎన్ఎఫ్ఎస్ఏ కిం ద పెట్టి మొత్తం అందరికీ కేంద్రమే బియ్యం పంపిణి చేస్తుండటం విశేషము.
