సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 22 నుండి పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతి శని, ఆదివారాల్లో పంచారామ క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించేందుకు వీలుగా భక్తుల కోసం ప్రభుత్వ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ బస్సులు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు తో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని సామర్ల కోట, దాక్షారామం లలో అక్టోబర్ 25, 26 తేదీలతోపాటు నవంబర్ 2,9, 16 తేదీల్లో జిల్లాలోని వివిధ బస్టాండ్లు నుంచి ఈ బస్సులు బయల్దేరతాయని వివరించింది. తద్వారా పవిత్ర స్వయం భువులైన .. అమరావతిలో అమరేశ్వర ఆలయం , భీమవరం లోని శ్రీ సోమారామం , పాలకొల్లు లోని క్షిర రామలింగేశ్వర , ద్రాక్షారామ భీమేశ్వర , సామర్లకోట క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకోవచ్చు. గత ఏడాది ఇదే నెలలో 26 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా.. ఈ సారి వాటి సంఖ్యను 36కి పెంచారు. వీటిలో సుఖ ప్రయాణం కోసం సూపర్ లగ్జరీ టికెట్ ధర రూ.1,120, అల్ట్రా డీలక్స్ ధర రూ.1,070గా నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *