సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని పవిత్ర పంచారామ క్షేత్రం గునుపూడి లో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములు 10వ రోజు సందర్భముగా గత సోమవారం భక్తులు పోటెత్తారు. అనేక వేల మంది ఉచిత దర్శనం చేసుకోంగా రూ.200/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.2,53,400/-, రూ.100/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.3,48,400/- రూ.50/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.1,50,200/-లు , లడ్డు ప్రసాదం వలన రూ.49,405/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.1,57,327/-లు మొత్తంగా రూ.9,58,732/-లు ఆదాయం లభించింది. భక్తులకు స్థానిక కురిశెేట్టి వారి కుటుంబ సభ్యులు మరియు మానేపల్లి వారి కుటుంబ సభ్యులు, శ్రీ స్వామి వారి అన్నదానం ట్రస్టు తరుపున వేలాది మ్దనికి అన్నప్రసాదం వితరణ చేయుట జరిగినది. ఈ కార్యక్రమం నందు గ్రామస్తులు, భక్తులు పాల్గొని సహాయ సహకారములు అందించారు. ఇక . శ్రీ స్వామి వారి ని ఉప కమీషనరు, దేవదాయ ధర్మాదాయ శాఖ,, డి.యల్.వి.రమేష్ బాబు, మరియు తెలుగు రాష్ట్రాలలో సంచనలం రేపుతున్న మహిళా ఆఘోోరి దర్శించుకోవడం జరిగింది. నేడు, మంగళవారం కూడా తెల్లవారు జాము నుండి విశేషంగా మహిళా భక్తులు స్వామి వారిని దర్శించుకొని పవిత్ర దీపారాధన చేసారు.
