సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త! తాజగా నేడు, గురువారం బంగారం ధర భారీగా దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1710 తగ్గిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఇక శుభముహూర్తాలు, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధర దిగుతూవస్తుంది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7 వేల 88గా ఉంది. పది గ్రాముల బంగారం ధర 70 వేల 880గా ఉంది. నిన్న బుధవారం నాడు మాత్రం రూ.72 వేల 590గా ఉంది.22 క్యారెట్ల గ్రాము బంగారం రూ.64973గా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.
