సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శనివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు ఆడపిల్లలు జీవితాలు, వారు కలలు కన్న భవిషత్తులు మానవ మృగాల చేతులలో ముగిసిన దారుణ ఘటనలు వారిని కాపాడుకోలేని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన అనే యువతి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన నవీన్ అనే రౌడీ షీటర్ నిన్న (శనివారం) సాయంత్రం యువతిని కారులో తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలో ఆమెను తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చి పరారయ్యాడు. అయితే తమ కుమార్తెకు ఏం జరిగిందో తెలియని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆ యువతి మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. నవీన్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇక ఇంతకూ మించి కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. బాలిక బట్టలకు నిప్పంటించి ఆమెను ఘోరంగా హత్య చేశాడు. బద్వేల్ పట్టణానికి చెందిన ఓ యువకుడికి ఆరు నెలలు క్రితం పెళైంది. అయినా మాజీ ప్రేయసి ఇంటర్ చదువుతున్న దస్త గిరమ్మనే కావాలనుకున్నాడు. యువతిని ఆమెను ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. బాలిక ఒప్పుకోకపోవడంతో నిప్పంటించి పరారయ్యాడు. ఆమెకు తీవ్రగాయాలై. స్థానికులు కడప రిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది.దస్త గిరమ్మ హత్య ఘటనపై ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు ఉద్యమాలకు సిద్ధమయ్యాయి. ఇక ఇటువంటి మరో దారుణ ఘటన.. .కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదని వీరేష్ అనే ప్రేమోన్మాది కర్నూల్ జిల్లా పత్తికొండ మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న అశ్వని అనే ఇంటర్ విద్యార్థిని చేత బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.. బాలిక ప్రతిఘటించడంతో బలవంతంగా క్రిమిసంహారక మందు తాగించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
