సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బాలీవుడ్ లో ఈ సంవత్సరం రంజాన్ పర్వదినం నేపథ్యంలో గత 4 ఏళ్లుగా వరుస పరాజయాలు తో ఉన్న సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ నటించి, నిర్మాతగా నిర్మించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా విడుదల అయింది. సుమారు 4500 స్క్రీన్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇందులో మన తెలుగు హీరో వెంకటేష్ , పూజహెగ్డే, జగపతి బాబు , భూమిక , రామ్ చరణ్ (చిన్న అతిధి పాత్రలో) వున్నారు. ఈసారి తెలుగు వాళ్ళకి ఈ సినిమా ఆసక్తి కరంగా ఉండటానికి పైన చెప్పిన నటులే కాకుండా, తెలంగాణ పండగ బోనాల పాట కూడా హైలైట్ గా వుంది. ఈ సినిమా తమిళ సినిమా ‘వీరం’ కి రీమేక్. అదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేసి ‘కాటమరాయుడు’ గా వచ్చింది. మరి సల్మాన్ ఖాన్ కూడా దీనిని ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే పేరు మీద తీసాడు కావటం. సినిమా రిజల్ట్ విషయానికి వస్తే..చూసే వారికీ కధ ముందే తెలియడంతో, ఎన్నోసారులు వచ్చిన కధే కావడం తో పెద్ద అంచనాలు లేవు. అయితే హిందీ తెలుగు కలయిక తో 50-50 గా నిర్మించిన సినిమా కావడం ఒక మంచి అనుభూతిని కలుగ జేస్తుంది. అయితే సల్మాన్ ఖాన్ అభిమానులను అలరిస్తుంది. ఇక సల్మాన్ మీద అభిమానం మేరకు.. వెంకటేష్ తన పాత్ర పరిధి మేరకు హుషారుగా చేసాడు. ఇక జగపతి బాబు కు ఇటువంటి విలన్ పాత్రలు కొట్టిన పిండి. అయితే ఇందులో అందంగా కనపడిన పూజ హెగ్డే, సల్మాన్ ఖాన్ ల మధ్య కెమిస్ట్రీ అంత బాగోలేదని కూడా అంటున్నారు. దర్శకుడు ఫర్హాద్ సమ్జీ రెండు బాషా సినిమాలు చూపించాడు అన్నట్టుగా వుంది . ఎందుకంటే సెకండ్ హాఫ్ సినిమా అంతా హైదరాబాద్ లో జరిగినట్టుగా చూపెట్టారు. సల్మాన్ తన ప్రియురాలు కోసం హైదరాబాద్ రావడం ఆమె అన్న వెంకటేష్ ను మెప్పించడం, అతని విరోధి జగపతి అరాచకాలు అడ్డుకోవడం అనే కధలో భాగంగా సన్నివేశాలు నడుస్తాయి. దీనిలో భాగంగా డైలాగ్స్ కూడా చాలా వరకు తెలుగులోనూ, అలాగే తెలుగు, హిందీ మిక్స్ చేసి కొన్ని మాటలు ఉంటాయి. దానికితోడు తెలుగు పాట కూడా మనం ముందే చూసేసాం ఎందుకంటే అది ముందే విడుదల చేసేసారు కదా. అలాగే రామ్ చరణ్ కూడా వెంకీ, సల్మాన్ తో కల్సి స్టెప్స్ ఒక వింత అనుభూతి.. మొత్తానికి సినిమా సో.. సో గా పర్వాలేదనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *