సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒకనాటి బీజేపీ కీలక నేత మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా నేడు, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్ సింగ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రకమం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్, మాజీ సీఎం నవీన్ పట్నాయక్, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.కాగా, కంభంపాటి హరిబాబు 2021 జులైలో తొలిసారి మిజోరం గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ రాజీనామాతో.. ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబును కేంద్రం నియమించింది.
