సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీకృష్ణ మహిమానిత్వ క్షేత్రంగా అనేక మహిమలతో బాసిల్లుతున్న ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్ర నేటి, ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమయింది.. ఈ క్రమంలో నేటి ఉదయం నుండి లక్షలాది మంది భక్తులు చేరుకోవడంతో గంటగంటకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. ప్రతి ఏడాది కొత్తగా అంతటి 3భారీ రథాలను కొయ్యతో నిర్మిచడం ప్రపంచంలోనే అద్భుతంగ పేర్కొనాలి. రథాలు లాగే ఆ దివ్య క్షణం కోసం అంతా వేచిచూస్తున్నారు. సింహద్వారం వద్ద స్వామివారి కోసం రథాలు వేచి ఉన్నాయి. ఈ ఏడాది రెండు రోజుల పాటు భక్తులకు రథాలు లాగే భాగ్యం కలగనుంది. 53 ఏళ్ల తర్వాత ఈ అరుదైన సంఘటన రావడం విశేషం. అంతకుముందు 1909 తర్వాత 1971లో అరుదైన శ్రీగుండిచా యాత్ర జరిగింది. ఈసారి జగన్నాథ రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొనడం మరో విశేషం. నేడు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది కృష్ణ భక్తులు తరలిరావడం తో సుమారు 10 లక్షల మంది అక్కడ చేరారు.
