సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములు సందర్భముగా నేడు, సోమవారంతెల్లవారు జాము 4 గంటల నుండి వేలాది భక్తులు క్యూ లైన్ లలో నిలబడి శ్రీ స్వామివారిని దర్శించుకొంటున్నారు. గత ఆదివారం 16వ రోజు సందర్భముగా సేవల వలన రూ.1,550/-లు, రూ.200/- దర్శనం టిక్కెట్ల వలన రూ.82,000/-, రూ.100/-లదర్శనం టిక్కెట్ల వలన రూ.75,600/-, రూ.50/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.69,450/-, లడ్డు ప్రసాదం వలన రూ.30,150/-లు, ది భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చంట్స్ అసోషియేషన్, భీమవరం వారిచే 8,500 మందికి అన్నప్రసాదం వితరణ నిర్వహించామని అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.1,41,442/-లు, మొత్తం రూ.4,00,192/-లు వచ్చి యున్నది అని దేవాలయ ఇఓ డి రామకృష్ణంరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *