సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి కానుకగా విడుదలయి 100 కోట్ల పైగా వసూళ్లు సాధించిన నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ సినిమా కు నిర్మాతలు తగిన ప్రమోషన్స్ ఇవ్వకపోవడంతో ఇంకా రావాల్సిన రెవెన్యూ తగ్గిందని అభిమానులు వాదన.. ఐతే దాకు మహారాజ్ సినిమాను కొల్లి బాబీ దర్శకత్వంలో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ను హాలివుడ్ సినిమా తరహాలో క్వాలిటీ తో చిత్రీకరించారు. ఇక ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా కథానాయికలుగా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటడు బాబీ డియోల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక తమన్ బీజీఎమ్ అదిరిపోతోంది. ఇటీవలే అనంతపురంలో ఈ సినిమా విజయోత్సవ వేడుక కూడా ఘనంగా నిర్వహించారు. డాకు మహారాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి ఫిబ్రవరి 9 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.
