సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం మధ్యాహ్నం పార్లమెంటు వద్ద టెన్షన్ వాతారవరణం నెలకొంది. బిహార్‌లో చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(SIR)కు నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసీ ని ఓట్ చోర్ (ఓట్ల దొంగ) అంటూ నినాదాలు చేస్తూ ఇండియా కూటమి ఆద్వర్యంలోని లోక్ సభ, రాజ్య సభకు చెందిన 300 మంది ఎంపీ లు పార్లమెంటు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు ర్యాలీకి బయలుదేరారు. సంసద్‌ మార్గ్‌లో భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాగుల్ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. మరోవైపు 30 మంది ఎంపీలకు మించి ఈసీ ని కలవడానికి అనుమతి లేదని ఇండియా కూటమి ఎంపీ ర్యాలీ ని పోలీస్ లు బారికెట్స్ అడ్డుపెట్టడంతో తీవ్ర తోపులాట ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. మాజీ సీఎం ములాయం సింగ్ తో పాటు పలువురు ఎంపీలు మహిళా ఎంపీలు భారికెట్స్ మీద నుండి సైతం అవతల వైపు దూకేసి తీవ్ర ఆవేశంతో మా పార్టీలను మా ప్రజల ఓట్లను చోరీ చేసి మోసం చేసి బీజేపీ వాళ్ళు ఈసి సహకారంతో గెలిస్తే నిలదీయకూడదా? ఓట్ల దొంగలు ..అంటూ పెద్దగా మీడియా ఛానెల్స్ ముందు అరవడం జరిగింది. తీవ్ర తోపులాటలు మద్య్హ రాహుల్ గాంధీ ప్రియకాగాంధీలను ఇతర ఎంపీలను అరెస్ట్ చేసి పోలీసులు ప్రత్యేక బస్సులలో అక్కడి నుండి తరలించడం తో దేశం అంతటా ఈ ఘటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *