సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి చుట్టూ జరుగుతున్న రాజకీయ వివాదం, ఇటీవల నాగపూర్ లో విద్వంసం, దహనాలు,34 మందికి గాయాలు అవ్వడం, కర్ఫ్యూ ల వరకు వెళ్ళింది. హిందువులనే కాదుఅనేక ప్రముఖ హిందూ దేవాలయాలు కూల్చి, అధికారం కోసం తన స్వంత సోదరులను సైతం చంపిన క్రూరుడు ఔరంగ జేబు సమాధిని ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించవలసిన అవసరం వుందా? అని మహారాష్ట్ర, సీఎం ఫడ్నవిస్ సైతం ప్రశ్నించడంతో.. తాజాగా ఈ నాగ్‌పూర్‌ ఘటనపై మాజీ సీఎం, శివసేన (UBT) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హింస వెనుక ఎవరున్నారో సీఎంను అడగండి. ఔరంగజేబు 300 ఏళ్ల క్రితం మరణిస్తే ఇప్పుడు సమాధి తవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే.. ప్రస్తుత ఎన్డీయేలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను కూడా ఇక్కడకు ఆహ్వానించాలని బీజేపీ కి సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *