సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల చావా సినిమా మహారాష్ట్రలో సంచలన విజయం సాధించడం ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ ని యుద్దభూమి లో ఎప్పటికి ఎదిరించలేక స్వంత కుటుంబ సభ్యులతో కుట్ర చేసి మోసపూరితంగా పట్టుకొని చిత్ర హింసలు పెట్టి చంపించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూరత్వం సన్నివేశాలు చూసి మహారాష్ట్రలో చాల మంది హిందూవులు ఆబాల గోపాలం రగిలిపోతున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ సమీపంలోని ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ డిమాండ్స్ పెరిగాయి.నాగపూర్ లో బజరంగ్ దళ్, VHP నిర్వహించిన ర్యాలీ లో ఔరంగజేబు ఫొటో, సమాధి నమూనాకు నిప్పు పెట్టారు. దీనికి ప్రతిగా మరో వర్గం వారు తీవ్ర ఆగ్రహంతో నిరసనకు దిగారు. పోలీసులు, వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. ఓ వాహనానికి నిప్పు పెట్టారు. సమాధి తొలగింపు డిమాండ్స్ హింసాత్మక ఘటనలకు దారి తీయడంతో నాగ్‌పూర్‌లోని పలు ప్రాంతాల్లో తాజగా ..నేడు మంగళవారం పోలీసులు కర్ఫ్యూ విధించారు. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 ప్రకారం, నగర పోలీసు కమిషనర్ రవీందర్ కుమార్ సింఘాల్ పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
