సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలోని ప్రధాన సెంటర్ అంబేద్కర్ సర్కిల్ లో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ దళితుడి నోటి లో మూత్రం పోసి అవమానపరిచారని ఆరోపిస్తూ.. దాడిని ఖండిస్తూ టీడీపీ నేతలు దళిత నాయకుల ఆధ్వర్యం లో నిరసన వ్యక్తం చేసారు. అగ్రవర్ణానికి చెందిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. జగన్ సర్కార్ దళితులకు రక్షణ ఇవ్వటం లో విఫలం అవుతుందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకే చెందిన మాజీ ZPTC జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎద్దు ఏసు పాదం, నియోజవర్గ అధ్యక్షులు మాత సురేష్ బాబు, రాష్ట్ర, జిల్లా, మండల,తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *