సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కందుకూరులో ప్రాణాలు కోల్పోయిన 8 మంది మృతి చెందటం ఫై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఈ దుర్ఘటన తనను కలచి వేసిందని మృతుల కుటుంబాలకు 2 లక్షల ప్రభుత్వ సహాయం, గాయపడిన వారి కుటుంబాలకు 50వేల చప్పున పీఎం సహాయ నిధి నుండి అందజేయాలని అధికారులను ఆదేశిస్తూ ట్విట్ చేసారు. నేడు, గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి గత రాత్రి కందుకూరు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన,గాయపడిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని, వారి పిల్లలను చదివిస్తామని, అలాగే గత రాత్రి 10 లక్షల చప్పున ప్రకటించిన ఆర్థిక సాయం మరింత పెంచి మృతుల కుటుంబాలకు 23 లక్షల చప్పున ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందిస్తామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *