సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న కడప స్టీల్ ప్యాక్టరీ కి సీఎం జగన్ నేడు, బుధవారం శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి, ఐటి మంత్రి గుడివాడ అమర్నాధ్ తో పాటు స్టీల్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సజ్జన్ జిం దాల్ పాల్గొన్నారు. సీఎం జగన్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేవుడి దయతో వైఎస్సా ర్ జిల్లాలో మంచి కార్య క్రమానికి శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. వైఎస్సార్ కల నేటి నుండి నిజం చేస్తామన్నారు. . వైఎస్సార్ మరణం తో ఈ ప్రాంతాన్ని స్టీల్ ప్యాక్టరీని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు.‘‘రూ.8,800 కోట్లతో 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృ ద్ధి చెందుతుంది. ఈ ప్లాంట్ రావడం కోసం కష్టాపడాల్సి వచ్చింది. ఈ ప్రాం తం వైజాగ్ స్టీల్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. తొలి విడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది’’ అని సీఎం జగన్ అన్నారు. మహానేత వైఎస్సార్ తనకు మంచి మిత్రులు, గురువు అని సీఎం జగన్తో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని సజ్జన్ జిందాల్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *