సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలం పొట్టిలంక వద్ద జాతీయరహదారిపై ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు (ఎస్ఎస్టీ) వద్ద వాహనాల తనిఖీలో భాగంగా కంటైనర్ బోలోరో వాహనాన్ని అనుమానంతో పోలీసులు నిలిపివేసి తనిఖీలు చేస్తుండగా, అందులో రూ. 2కోట్ల 58 లక్షల విలువైన 3.347 కేజీల బంగారు, వెండి వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముందే సమాచారం అందడంతో సీఐ తులసీధర్ సంఘటనా స్థలానికి వెళ్లారు. సమాచారాన్ని ఎస్పీ పి.జగదీష్, రూరల్ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్‌భరత్‌కు తెలిపారు. వారి ఆదేశాల ప్రకారం అసి స్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, కడియం తహసీల్దారు బి.రమాదేవి, ఫ్లైయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కె.వినయ్ బృందం, ఇన్‌కంటాక్స్, జీఎస్టీ అధికారులు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. దొరికిన నగలు సంబధిత వ్యక్తులు రాజమండ్రి లోని నగల దుకాణానికి తీసుకు వెళుతున్నట్లు గుర్తించారు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారింస్తున్నారు. up file photo
