సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నేడు, ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. అస్తి నష్టం. ప్రాణ నష్టం జరుగుతుంది. జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించింది. కనివినిరీతిలో కృష్ణ, గుంటూరు బాపట్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాలలో అపార్టుమెంట్లలో సైతం ఫస్ట్ ఫ్లోర్లు వరకు నీరు నిండిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై వరదనీరు భారీగా చేరింది. దీంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కిలో మీటర్లు మేర వాహనాల రాకపోకలు గత రాత్రి నుండి పూర్తిగా నిలిచిపోయాయి మునేరు, వైరా, కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రహదారిపైకి నీరు చేరింది..మరోవైపు సముద్రంలో వేటకు వెళ్లి బాపట్ల జిల్లా చిన్నగంజాం మత్స్యకారులు తప్పిపోయారు. చెన్నై నుంచి విశాఖపట్నం చేపల వేటకు బోట్లలో వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ లభించడం లేదు. విశాఖ సముద్రతీరంలో బోట్ చిక్కుకున్నట్లు సమాచారం. పలు చోట్ల ప్రజలకు ఎటువంటి సహాయ చర్యలు జరగక పోవడంతో గుంటూరు కృష్ణ జిల్లాలో ప్రజలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
