సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాలర్ తో పోలిస్తే రూపాయి కరెన్సీ విలువ మారకంలో 30 పైసలు క్షీణించి 81.23 స్థాయికి దిగజారింది. మరలా కాస్త కోలుకుని చివరికి రూ.81.09 వద్ద ముగిసింది. అయితే రూపాయికి గతంలో ఎన్నడూ లేనంత ఇది కనిష్ఠ స్థాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పుంజుకోవడం, ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ఇందుకు ప్రధాన కారణాలయ్యాయి. చివరి 3 సెషన్లలో రూపాయి 135 పైసలు మేర క్షీణించిందంటే పతనం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియకపోవడం, అమెరికా సహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం నియంత్రణకు వడ్డీ రేట్లు ఎక్కువ మోతులో పెంచుతుండటం, ఈక్విటీ మార్కెట్ల నష్టాలు వంటి పరిణామాలు మన కరెన్సీని రోజురోజుకూ బలహీనం చేస్తున్నాయి. రూపాయి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 8 శాతానికిపైగానే క్షీణించింది.
