సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యా ణ్ ఒక మీడియా ఛానెల్ కు ఇచ్చిన తాజా ఇంటర్యూ లో.. తనకు 2019 ఎన్నికలలో కనీసం 30 సీట్లు గెలచి ఉంటె.. (టీడీపీ కూడా గెలిచింది 23 మాత్రమే కదా?) ఈసారి పొత్తులు పెట్టుకొనే పార్టీలతో తనకు సీఎం పదవి అడగడానికి అవకాశం దక్కి ఉండేదని, సీఎం సీటు అడిగే అర్హత కోల్పోయానని, పొత్తు పెట్టుకొనే పార్టీతో సీఎం సీటుకోసం డిమాండ్ చెయ్యనని, రాష్ట్రంలో అదుపు తప్పి పాలిస్తున్న వైసిపి ని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమని ప్రకటించారు. దీనితో పవన్ పరోక్షంగా టీడీపీతో పొత్తు లో సీఎం పదవి కండిషన్ వదులు కొన్నానని , అంతే కాదు తనకు గతంలో టీడీపీ ఆఫర్ చేసినట్లు ప్రచారంలో ఉన్న 30 సీట్లతో సరిపెట్టుకొంటానని బలమైన సంకేతం పరోక్షంగా ఇచ్చినట్లు అయ్యింది. గత కొంతకాలం క్రితం గా పవన్ కళ్యాణ్ .. ఎప్పు డూ తామే త్యాగాలు చేయాలా? ఈసారి మాతో పొత్తు పెట్టుకొనే పార్టీలు సీట్లు తో పాటు సీఎం పదవి త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని పిలుపు నివ్వడంతో మంచి జోష్ వచ్చింది. అయితే.. పవన్ , జనసేన నేతలు, అభిమానులు లో టీడీపీ తో పొత్తు ఉంటె.. ఎన్నికలలో అధికారంలోకి వస్తే.. సీట్ల గెలుపు ప్రాతిపదికను కాకుండా కనీసం 2 ఏళ్ళు సీఎం పదవి పవన్ కు ఇస్తారని ఆశ ఉండేది. తాజగా పవన్ ప్రకటనతో టీడీపీ శ్రేణులు హర్షం ప్రకటించగా .. మరో ప్రక్క జనసేన శ్రేణులు లో ఒకింత ఆలోచనలో పడ్డాయనే చెప్పాలి. ఒకవేళ టీడీపీ తో పొత్తు కుదిరితే ముందుగా అనుకున్నట్లు 30 సీట్లు ఇస్తారా? ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? చూడాలి..
