సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విడుదల కు సిద్ధమైన ‘కన్నప్ప’ ప్రమోషన్లను హీరో నిర్మాత మంచు విష్ణు ఇప్పటికే అమెరికా నుంచి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా అక్కడ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూ లో .. కన్నప్ప సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఈ ముగ్గురి వళ్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని, సినిమాకు సైతం మార్కెట్ వచ్చిందని అన్నారు. ఇక సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలు ఉంటుందని అందులో వార్ ఎపిసోడ్ 10 నిమిషాలు, మోహాన్‌లాల్ పాత్ర 15 నిమిషాలు అన్నింటికంటే ముఖ్యంగా ప్రభాస్ పాత్ర అయితే 30 నిమిషాలకు పైగానే ఉంటుందని, అయితే.. ప్రభాస్ (Prabhas) స్టోరీ లైన్ వినకుండానే ఈ సినిమా చేశాడని.. షూటింగ్ జరుగుతూ పోతూ ఉంటే కథ వింటూ ప్రభాస్ ఇదేదో మాములుగా లేదంటూ ఆశ్చర్య పోయారని అన్నారు. అతనికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రభాస్ ఈ రోజు ఉన్న స్థాయికి ఈ సినిమాలో చేయాల్సిన అవసరం లేదని ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా కేవలం నాన్న గారి మీద ఉన్న ప్రేమతో ఈ సినిమా చేశాడని అందుకే ఆ పాత్రను(నందీశ్వరుడు) ఎక్కడా తగ్గించకుండా చూసుకున్నామని, పాత్ర నిడివి ఎక్కువగానే ఉన్నప్పటికీ సినిమా కోసం 30 నిమిషాలు వాడుకున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభాస్, మోహన్ బాబుల మధ్య వచ్చే వాగ్వాదం, ప్రభాస్, నా మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వచ్చాయన్నారు.
