సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ హీరో మోహన్ బాబు సమర్పణలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక పాత్రలో మంచు విష్ణు హీరోగా నటించిన 100కోట్ల భారీ సినిమా కన్నప్ప జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో నేడు శనివారం ఈ సినిమాట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్లు లో మొదట్లోనే ఓ కుర్రాడు ఒక రాయి తీసుకొని దేవుడు లేడు జీవుడు లేడు అంటూ దేవుడి విగ్రహం పై రాయి విసిరే సన్నివేశం పెట్టారు. ఇక శివుడిగా అక్షయ్కుమార్ పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. ఇక వాయు లింగం కోసం జరిగే యుద్ధసన్నివేశాలు బాగా కట్ చేసారు. ఇక ట్రైలర్ చూస్తుంటే విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయ్. ఇక ప్రభాస్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు 10 ఏళ్ళ క్రితం మహాభారత్ టివి సీరియల్ ను అద్భుతంగ చిత్రకరించిన డైరెక్టర్
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *