సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంచు విష్ణు హీరోగా అత్యధిక బడ్జె్ట్తో మోహన్ బాబు నిర్మిస్తున్నపాన్ ఇండియా సినిమా.. కన్నప్ప సినిమా టీజర్ నేడు, శనివారం ఉదయం విడుదల చేసారు. నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్ అడవులతోపాటు.. రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీలోనందీశ్వరుడు గా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో, మోహన్ లాల్, శివరాజ్ కుమార్,మోహన్ బాబు శరత్ కుమార్, పార్వతి పరమేశ్వరులుగా అక్షయ్ కుమార్ , కాజల్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసారి విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ పార్ట్ చూపించారు. అలాగే సినిమాలోని కీలక పాత్రలను రివీల్ చేశారు. ఇక చివరిలో ప్రభాస్ లుక్ ను కూడా చూపించారు. ఈ టీజర్ లో ప్రభాస్ ఎంట్రీ బాగుంది.
