సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించిన వేలాది వైసీపీ అభిమానులు తరలి రావడం రోడ్ పొడవునా ఆయన కాన్వాయ్ ని అపి జగన్ ను చూడాలని దూసుకొని రావడం.. ట్రాఫిక్ జామ్.. తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన రక్షణ విషయంలో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో నేడు, బుధవారం సత్తెనపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామా ఉప సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించ డానికి, నాగమల్లేశ్వర రావు విగ్రహం ప్రారంభించడానికి జగన్ సత్తెనపల్లి వెళ్లారు. ఐతే, ఈ పర్యటనకు జగన్ తో పాటు 3 వాహనాలు రావాలని , 100 మంది మించి అభిమానులు రాకూడదని పోలీసులు షరతులు విధించారు. ప్రతి 2 కిలో మీటర్లు కు కెహెప్పున 20 కి పైగా పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి పోలీసులు మోహరించినప్పటికీ జగన్ కు దారి పొడవునా వైసీపీ శ్రేణులు ఉత్సహంగా స్వాగతమ్ పలికాయి. జగన్ వారిని దాటుకొని నాగ మల్లేశ్వర రావు విగ్రహం ఆవిష్కరించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానన్నారు. జగన్ మాట్లాడుతూ.. కమ్మ కులానికి చెందిన వైసీపీ నేత గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కూటమి అధికారంలోకి వచ్చాక పోలిసుల, కూటమి నేతల వేధింపులు , కుటుంబాన్ని అవమానించడం తట్టుకోలేక గత ఏడాది జూన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. కమ్మ కులం వాళ్ళు టీడీపీ పార్టీకే అంకితం కావాలా? వైసీపీ లో ఉంటె వేధిస్తారా? అని జగన్ ప్రశ్నించారు. అయితే నేడు జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. జగన్ కాన్వాయి లో ఒక వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందటం తీవ్ర విషాదం నింపింది.
