సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పాలమూరులో నేడు, ఆదివారం మధ్యాహ్నం ప్రజా గర్జన బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసు. ప్రభుత్వా న్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి. కరప్షన్, కమీషన్ ఈ రెండు పార్టీల సిద్ధాంతం. కాం గ్రెస్, బీఆర్ఎస్ కు ఈరోజు రాత్రి నిద్రపట్టదు. ఈ ప్రజాస్వామ వ్యవస్థను కుటుంబవ్య వస్థగా మార్చేశారు. పెద్ద పోస్టుల్లో కుటుంబ సభ్యులుంటారు.. తమ అవసరాల కోసమే కొందరు బయటి వ్యక్తులు ఉంటారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. నేడు తెలంగాణలో రూ.13,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నాం . తెలంగాణ ప్రజల సం క్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. తెలంగాణకు 9 ఏళ్లలో లక్ష కోట్ల నిధులిచ్చాం . తెలంగాణలో తొమ్మిదేళ్లలో 2,500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించాం. ప్రతీ గ్రామం, నుంచి పట్టణాలకు వచ్చేందుకు రోడ్లు వేశాం .రుణమాఫీ పేరుతలో తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. పసుపు రైతుల సం క్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో ఎంతో మేలు జరుగుతుంది. పసుపు ఎగుమతి గతంలో పోలిస్తే రెట్టింపు అయ్యింది. చారిత్రాత్మక మహిళా బిల్లును ఆమోదించుకున్నాం అని ప్రధాని మోడీ అన్నారు.
