సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; అజిత్ దోవల్ తో పాటు భారత్ రక్షణ అధికారులతో నేడు, గురువారం ప్రధాని మోడీ సమీక్షలు జరుపుతున్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుంది. నేడు, గురువారం కరాచీ, లాహోర్, సహా ఇతర ప్రధాన నగరాలపై దాడి చేయడానికి భారతదేశం డ్రోన్‌లను ఉపయోగించిందని పాకిస్తాన్ ప్రకటించింది. లాహోర్ లో నేటి ఉదయం భారీ పేలుళ్లతో అసలు ఏమి జరుగుతుందో ఎవరికీ అంతుబట్టలేదు. అయితే పాకిస్తాన్, PoKలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు క్షిపణి దాడులు చేసిన ఒక రోజు తర్వాత, లాహోర్, కరాచీలపై భారతదేశం డ్రోన్ దాడులు ప్రారంభించిందని పాకిస్తాన్ సైన్యం తాజగా ప్రకటించింది. పాక్ సైనిక అధికారులు ప్రపంచ మీడియా తో మాట్లాడుతూ.. తాజాగా పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్‌పై భారత్ డ్రోన్ దాడి చేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. అటు, రావల్పిండి హెడ్ క్వార్టర్ పైనా భారత్ డ్రోన్ దాడి చేసింది. లాహోర్, కరాచీ ఇంకా పాకిస్థాన్ లోని ఇతర ప్రదేశాలలో భారత్ వరుస డ్రోన్ దాడులు నిర్వహించిందని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. మరోవైపు, లాహోర్ తో పాటు కరాచీ విమానాశ్రయాన్ని సాయంత్రం 6 గంటల వరకు మూసివేసినట్లు ఇస్లామాబాద్, లో “సాంకేతిక కారణాల వల్ల” కొంత సమయం మూసివేసినట్లు పాకిస్తాన్ పౌర విమానయాన సంస్థ తెలిపింది.
