సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలో కుబేరులు ప్రపంచ స్థాయి కుబేరులుగా మారిపోతున్నారు. అయితే గత 4 ఏళ్లుగా కరోనా సంక్షోభంలో ప్రజల కష్టాల కు తోడు అప్పుడే ప్రారంభమైన నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక ప్రక్క పెట్రోలు, నూనె ధరలు మరో ప్రక్క వంట గ్యాస్ ధరలు సామాన్యుడి బ్రతుకు తెరువును ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. మరల ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి. దక్షిణదిన పెద్ద రాష్ట్రము కర్ణాటకలో మరో 2 రోజులలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మీడియా స్వర్వే రిపోర్ట్స్ గంటాపధంగా చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రజలకు శుభవార్త అందింది. ఇంటిలో సామాన్యులు వంట కోసం వాడే సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే వంతుల వారీగా లీటర్ కు 180 రూపాయల నుండి 130 రూ దిగువకు వచ్చిన ఆయిల్ ధరలు మరింత తగ్గనున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం టారిఫ్ రేట్ కోటా (TRQ) విధానం కింద ముడి సోయా బీన్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం , వ్య వసాయ మౌలిక సదుపాయాలు, అభివృ ద్ధి సెస్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మినహాయింపు2022-23 ఆర్థిక సం వత్స రానికి టారిఫ్ రేట్ కోటా లైసెన్స్ ఉన్నదిగుమతిదారులకు మాత్రమే వర్తిస్తుంది.
