సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ నేడు, బుధవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్ చెప్పారు.. ప్రజలకు సూపర్ సిక్స్ పధకాలు ఎగ్గొట్టి అవి వారికీ గుర్తుకు రాకుండా ఒక పధకం ప్రకారం ప్రతీ నెలా ఎదో ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తానని బాదుడే బాదుడు మొదలైందంటూ, కరెంట్ చార్జీలు భారీగా పెంచేసి 15000 కోట్ల అదనపు సంపద సృష్టిస్తారని ఎద్దేవా చేసారు. తమ వైసీపీ హయాంలో జరిగిన అబివృద్ధి నిర్మాణాలను ప్రెవేటు కు అమ్మేసుకోని సంపద సృష్టించడం లో చంద్రబాబు బిజీగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోందని.. తమకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మళ్లీ అధికారంలోకి వస్తామంటూ జగన్ ధీమా వ్యక్తంచేశారు ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు రేషన్ బియ్యాన్ని కాకినాడలో ఎగుమతి చేస్తున్న ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని జగన్ అన్నారు. ఆరు నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన జరుగుతోందని.. చెక్‌పోస్టులు దాటి బియ్యం కాకినాడ పోర్టు వరకు ఎలా వస్తున్నాయని జగన్ ప్రశ్నించారు. వైసీపీ పార్టీలో ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతా ఉండాలని.. అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలంటూ వైసీపీ పార్టీ శ్రేణులకు జగన్ సూచనలు చేశారు.
