సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదేశాలు అందాయి.అంతేకాదు తాజగా దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృ ద్ధి చేసిన ‘ఇన్‌కొవాక్’ను బూస్టర్ డోసుగా.. ముక్కు లో 2 చుక్కలు వేసే అతి సులువైన టీకా మందుకు ఆమోదం తెలిపినట్లు నేడు, శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమం లో భాగం గా ఈ రోజు నుం చి టీకా అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనే లభ్యం కానుంది. అయితే, ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్న వారు ఈ నాసికా టీకాను హెటిరోలాగస్ బూస్టర్ గా తీసుకోవచ్చని, మనదేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వినియోగించవచ్చునని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
