సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కరోనా కొత్త వేరియంట్ ఇటీవల కర్ణాటకలో ప్రవేశించిన నేపథ్యంలో దాని సరిహద్దులో ఉన్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యింది.కొత్త వేరియంట్ కు వేగంగా విస్తరించే గుణం ఉండటంతో ప్రభుత్వం ఇప్పటికే చారిత్రక ట్యాంక్‌బండ్ సహా చార్మినార్‌ల వద్ద ‘ఫన్‌డే’ వేడుకలను రద్దు చేసింది. సందర్శకులపైనే కాకుండా సాధారణ ప్రజలపై కూడా ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ను విధిగా వాడాలనే ఆదేశాలను ఖచ్చితం చేసింది. లేని పక్షంలో ఏకంగా 1000 రూపాయల ఫైన్ విధించింది. వైరస్ ప్రబలడానికి ఎక్కువ అవకాశాలు, రద్దీగా ఉండే.. జియాగూడ, మేకలమండి, మలక్‌పేట్ గంజ్, బేగంబజార్, పాతబస్తీ, మలక్‌పేట్, బేగంపేట్, మాదన్నపేట, గుడిమల్కాపూర్, సరూర్‌నగర్ మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు విధించింది. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.
