సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, బుధవారం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ పక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తం 31 జిల్లాలలో 12 జిల్లాలో తెలుగు వారి ప్రాబల్యం ఎక్కువ కావడంతో తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఈ ఎన్నికల ఫలితాలు పట్ల ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రస్తుత అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తో కాంగ్రెస్ పార్టీ నువ్వా- నేనా? అన్నస్థాయిలో పోరాడుతున్నట్లు తాజా విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఫలితాలు కోసం ఈ నెల 13వ తేదీ వరకు వేచి ఉండాలి. ఇక నేటి ఎన్నికల పోలింగ్ లో కేంద్రమంత్రులు , మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్ బెంగళూరులో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘మనం మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలి… కర్ణాటక ఉజ్వలంగా ఉండాలి’’నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బెంగళూరులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత నిర్మలా సీతారామన్ తాను ఓటు వేసినట్లు వీడియోను ట్వీట్ చేశారు. ప్రస్తుత ఓటింగ్ సరళి వేగంగా ఉంది కాబ్బటి నేటి సాయంత్రానికి మొత్తం ఓటింగ్ శాతం సుమారు 70 శాతం ఉండవచ్చునని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *