సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం రాత్రి 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ సమావేశం జరగనుంది. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను సీఎం సిద్ద రామయ్యను సీఎం చేసేందుకు ఒప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు డీకే శివకుమార్ కోరిన శాఖలు ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా..అయితే మన సిగ్మా న్యూస్ లో నిన్న తెలిపినట్లు .. ముఖ్యమంత్రిగా పవర్ షేరింగ్ ఫార్ములాతో డీకేను కాంగ్రెస్ ఒప్పించింది. కర్ణాటక సీఎంగా మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు సీఎంగా డీకే శివకుమార్ కొనసాగనున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. 4 రోజులు ఎడమొఖం పెడముఖంగా ఉన్న డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో కలిసి చేయిచేయీ కలిపి, భోజనాలు చేస్తూ ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. కర్ణాటక ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, 6.5 కోట్ల కన్నడిగులకు ఇచ్చిన 5 గ్యారెంటీలను నెరవేరుస్తామని మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ఇక..ఈ నెల .20వ తేదీన బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరగనున్న సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలను కాంగ్రెస్ ఆహ్వానించింది.
