సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : కర్ణాటకలో ఘన విజయం సాధించి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తన ముఖ్య మంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి తీవ్ర కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో పాటు మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా పదవిని ఆశిస్తుం డటంతో అధిష్టానానికి తలనొప్పి గా మారింది. అయితే నేడు బుధవారం సిద్ధరామయ్య తో పాటు డీకే శివకుమార్ తో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ హామీ మేరకు డీకే శివకుమార్ మెత్తబడినట్లు సమాచారం. మరో ఏడాది లో లోక్ సభ ఎన్నికలు రానున్న దృష్ట్యా .సీనియారిటీ, క్లీన్ ఇమేజ్ కారణంగా కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ కు ఉప ముఖ్య మంత్రి పదవి ఇచ్చినప్పటికీ 2 ఏళ్లలో సీఎం గా ప్రమోషన్ వస్తుందని హామీ లభించినట్లు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఇంకా సస్పెన్సు కొనసాగిస్తూ మరో 48-72 గంటల్లో కర్ణాటకలో కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేస్తామని కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జ్ రణదీప్ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. ముఖ్య మంత్రి అభ్య ర్థిత్వం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రకటించి మీడియాకు ట్విస్ట్ ఇచ్చారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కి చూసి.. చూసి.. డీకే శివకుమార్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడా?
