సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతియేటా నిర్వహించే వేదిక, బ్రిటీష్ కాలం నాటి రాజ్‌పథ్‌ను పునరుద్ధరణ తర్వాత ‘కర్తవ్య పథ్’గా పేరు మార్చారు. ఈ కర్తవ్య పథ్‌పైగా తొలిసారిగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి పాల్గొన్నారు. ఈ శుభసందర్భంగా దేశవాసులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సమయంలో జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవం విశిష్టమైనది. దేశం కోసం అసువులుబాసిన స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజమవ్వాలంటే ఉమ్మడిగా ముందుకుసాగాలని దేశవాసులకు సందేశమిచ్చారు. వందేభారతం డ్యాన్స్ కాంపిటీషన్ కోసం దేశవ్యాప్తంగా 479 మంది కళాకారులను అన్ని ప్రాంతాల నుండి ఎంపిక చేసి వారితో చేసిన ప్రదర్శన ఈ రిపబ్లిక్ ప్రత్యకత గా నిలుస్తుంది ( update photo)
