సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్నూలు లో ప్రెవేటు బస్సులో జరిగిన భయానక అగ్ని ప్రమాద ఘటన లో 20 మంది సజీవ దహనం అయ్యారు. మరో 12 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. దేశం యావత్తు దిగ్బ్రాంతి చెందిన ఈ ఘటనపై పోలీస్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనపై ఫోరెన్సిన్ బృందాలు క్లూస్ ఆధారంగా అనేక కోణాల్లో ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై పరిశిలిస్తున్నారు. చిన్నటేకూరు సమీపంలో ఎదురుగ వచ్చిన బైక్ ఢీ కొట్టి అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్లో సుమారు 400 వందల మొబైల్ ఫోన్లు ఉన్నాయని, ఇవి ఒక్కసారిగా పేలడం వల్లే భారీ ప్రాణనష్టం జరిగిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమిక విచారణలో గుర్తించాయి. ‘మొదటగా బైక్ ను బస్సు ఢీ కొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడంతో మంటలు మొదలయ్యి కొద్దీ క్షణాలలోనే బస్సు భారీ పేలుళ్లతో ప్రయాణికులతో సహా దగ్ధం అయ్యింది. ఎన్నో కుటుంబాలలో కోలుకొని విషాదంలో ముంచింది. ఆ సెల్ ఫోన్ లు ప్రయాణికుల ప్రాణాలకు ఉచ్చు బిగించాయి.
