సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్నూల్ జిల్లాలో నేడు, మంగళవారం కొద్దీ సేపటి క్రితం ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై అడ్డువచ్చిన వాహనాలను గుద్దుకోంటు బైకుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైకుల పై నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆదోని మండలం పాండవగల్లు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. దీనితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకొన్నాయి. పూర్తీసమాచారం అందవలసి ఉంది.
