సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ ల ‘ గాడ్ పాదర్’ ,నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాలు విజయదశమి కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్నాయి. ఇక కింగ్ నాగార్జున , గరుడావెగా పేమ్ .. ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్’ ప్రమోషన్ లో భాగంగా నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటెన్స్ ట్రైనింగ్ చూపించే వీడియో- గన్స్, స్వోర్డ్స్‌ని విడుదల చేసారు మేకర్స్. ఇక సెప్టెంబర్ 25న కర్నూలులో గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించబోతున్నారు. ‘ది ఘోస్ట్’ సినిమాకు సంబంధించిన ఈ ఫంక్షన్‌కు గెస్ట్‌లుగా నాగార్జున కుమారులైన అక్కినేని నాగ చైతన్య , అక్కినేని అఖిల్ హాజరౌతారు. ఒకే వేదికపై అక్కినేని అభిమానులకు ఆ వేడుక నిజంగా కన్నుల పండుగే
