సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్నూలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు నేటి శుక్రవారం తెల్లవారు జామున ఉలిందకొండ సమీపంలో బైకును ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 12 మంది మాత్రం అద్దాలు పగులకొట్టుకొని కిందకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం మిగతా 32 పయణికులు పరిస్థితి అగ్ని ప్రమాదంలో ఘోరంగా ఉంది. ఎంతమంది మరణించారో ఎందరు ఆసుపత్రులలో కోలుకొనే అవకాశం ఉందొ ఇంకా . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో తెలంగాణ వారు ఎక్కుమంది ఉండగా కర్నూలు కి చెందిన ఒకే కుటుంబ సభ్యులు నలుగురు మరణించినట్లు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. కర్నూల్ బస్సు ప్రమాదంలో మృతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే.. క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం పరిహారం చెల్లించింది..కర్నూల్ బస్సు ప్రమాదంలో మృతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే.. క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం పరిహారం చెల్లించింది
