సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నేడు, శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన తో బీజేపీ పొత్తు కొనసాగుతుందా? లేదా? అన్న ప్రశ్న ఫై కీలక వ్యాఖ్యలు చేశారు. మాతో కలసి వస్తే జనసేన తో పొత్తు ఉంటుంది. లేకపోతె బీజేపీ కి జనంతో మాత్రమే పొత్తు ఉంటుంది అని ప్రకటిస్తూ.. ‘‘జనంతో మా పొత్తు అనే మాట చాలా బలమైనది. ఈ వ్యాఖ్య వెనుక ఎంతో అర్ధం ఉంది. జనముతోనే మా పొత్తు.. కలసి వస్తే జనసేనతో పొత్తు’’ అంటూ స్పష్టం చేశారు. అంటే జనసేన రాకపోతే ఇక ఎటువంటి పొత్తులు ఉండవని ఆయన అంతార్ధం.. పార్టీలో తమ కుటుంబాలకు విలువ ఇచ్చి ప్రజలను రోడ్ల మీద వదిలేసిన పార్టీలతో తమ పొత్తు ఉండదని తెలిపారు.వైసీపీ, టీడీపీ లు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు… ఇవి కుటుంబ పార్టీలన్నారు. రాష్ట్రంలో కేపిటల్ లేకుండా పోవడానికి కుటుంబ పార్టీలే వారు చేస్తున్న తప్పులే కారణమని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ తప్పిదాలపై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. త్వరలోనే పాదయాత్రలు చేస్తామని ప్రకటించారు. అధికారం, అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్‌లు జరుగుతాయని గతంలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా ఇదే చేసిందని ఆరోపించారు.
