సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భీమవరం జిల్లా కలెక్టరేట్ భవనాల నిర్మాణం ఫై జరుగుతున్నా వివాదం మరింత వేడి రాజుకొంది. తాజా నేడు, గురువారం ఉదయం రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు భీమవరం గునుపూడి లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కలెక్టరేట్ ను భీమవరం పట్టణంలోనే జిల్లా ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా మార్కెట్ యార్డ్ లోనే నిర్మించాలి, అక్కడ ప్రభుత్వ స్థలం కేటాయిస్తూ ఇచ్చిన జీవో 124 రద్దు కాలేదు. గతంలోనే నిధులు విడుదల చేసి టెండర్లు పిలిచారు, మరి ఆ నిధులు ఏమైయ్యాయి? అని డిమాండ్ చేసారు. ఇటీవల భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు అలాగే ఉండి ఎమ్మెల్యే , అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కలెక్టరేట్ నిర్మాణం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కాకుండా వేరే చోట నిర్మిస్తామని చెప్పి విషయాన్ని ఇరువురు కాంట్రవర్సీ చేస్తు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. రఘురామా.. నుద్దేశించి అసలు కలెక్టరేట్ ను ఉండిలో నిర్మించాలని మిమ్మల్ని ఎవరు కోరారు…?డబ్బు, పలుకుబడి ఉందని భీమవరం కలెక్టరేట్ తీసుకుపోతామంటే కుదరదు అని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం పట్టణంలో స్థలాలు లేవనడం సత్య దూరం అన్నారు. ఇప్పుడు కొత్తగా ఎక్కడో దూరంగా 20 ఎకరాలలో కలెక్టరేట్ నిర్మిస్తానంటూ కాలయాపన చేస్తున్నారు. నిజంగా కలెక్టరేట్ కు 20 ఎకరాలు కావాలంటే..భీమవరం కు సమీపంలో ప్రభుత్వం సేకరించిన 72 ఎకరాలు, ప్రస్తుత కలెక్టరేట్ సమీపంలో 10 ఎకరాలు ఎండోమెంట్స్ భూమి, తహశీల్దార్ కార్యాలయం ఆరు ఎకరాలు భూములు సిద్ధంగా ఉంది. కానీపెదమిరం ఇరిగేషన్ స్థలంలో కట్టాలంటే సుప్రీం కోర్టు అనుమతి తీసుకుని, క్యాబినెట్ తీర్మానం చేయాలి అన్నారు మోషేను రాజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *