సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో నేడు, బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి జన్మదినోత్సవం సందర్భంగా వారి తండ్రి బుచ్చిబాబు ధనుర్మాస విశేష సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష పూజలు చేయించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించారు. తదుపరి ఆలయ మర్యాదలతో కలెక్టర్ ప్రశాంతికి స్వామివారి శేష వస్త్రం వేద ఆశీర్వచనం ఆలయ అర్చకులు పాణింగిపల్లి శ్రీనివాసాచార్యులు అందజేశారు ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు శ్రీవారి ధనుర్మాస విశేష ప్రసాదములను అందజేశారు ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి కుక్కల బాల వెంకటరత్నం గాదిరాజు సుబ్బరాజు, కడలి వెంకటేశ్వరరావు తదితర భక్తులు పాల్గొన్నారు
