సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం ఎక్కడ చుసిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి’ సినిమా గురించి ఆ సినిమా సాధించిన ఘన విజయం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కల్కి తొలిరోజు రూ.191 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా .. 2 రోజులకు కలపి 298 కోట్లు పైగా సాధించినట్లు ప్రకటన విడుదల చేసారు. గత 6 ఏళ్ళ క్రితం సుమారు 2000 కోట్లు వసూళ్లు సాధించిన బాహుబలి 2 తరువాత లాంగ్ రన్లో అత్యధిక వసూళ్లు సాధించే సినిమాగా కల్కి ఉంటుందని అభిమానులు భావిస్తుండగా.. కల్కి జోష్ చూస్తుంటే ఆవలిల గా 2వారాలకే రూ.1000 కోట్లు పైగా కలెక్షన్ సొంతంచేసుకొనే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తాజాగా నిర్మాత అశ్వనీదత్ మీడియాతో తన ఆనందము వ్యక్తం చేస్తూ త్వరలో కల్కి సీక్వెల్ కూడా సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. నిజానికి సీక్వెల్ కూడా ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని కాకపోతే కీలక సన్నివేశాలు మాత్రం పెండింగ్లో ఉంచామని చెప్పారు. వాటి షూటింగ్పూర్తయిర్తన తర్వాత రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తామని అన్నారు. అన్ని కలిసొస్తే ఈ ఏడాది చివరలో లేదా సంక్రాంతికి కల్కి సీక్వల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. 2వ భాగంలో కీలకమైన కృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబును ఒప్పించడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు? తెలుస్తుంది. ఇదే జరిగితే.. కల్కి 2 ఫై అంచనాలు మరింత పెరిగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *