సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). దీపిక పదుకొణె హీరోయిన్ కాగా లోకనాయకుడు.. కమల్‌హాసన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్ని హైలైట్స్ తో వస్తున్నా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో 90 రోజుల్లో ట్రైలర్ వస్తుందని తాజా ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో వినియోగించే స్పెషల్ గన్స్ ఎలా తయారు చేశారో తెలిపే వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆద్యంతం నవ్వులు పంచుతూనే ఆ గన్స్ తయారీని ఫన్ వీడియో ను మీరు ఆస్వాదించండి.
