సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైంటిఫిక్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్వి న్ దర్శ కత్వం వహిస్తున్నా రు. ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా గా వేసవి స్పెషల్ గా మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. తమ వైజయంతి బ్యానర్ ఫై జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు మే 9నే విడుదలయి చరిత్ర సృష్టించాయని అందుకే కల్కి సినిమా కు అదే డేట్ పిక్స్ చేసినట్లు తెలిపారు. ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనె దిశాపటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నా రు. హీరోలు నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ కీలక పాత్రల్లోకనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్ ఈ నెల రెండో వారం లో చిత్రీకరించేలా ప్లాన్ చేశారట నాగ్ అశ్విన్.ప్రభాస్, తో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణమం తా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం.
