సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె లతో విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ క్రేజీ కాంబినేష్లో రూపొందుతున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించి ఉన్నారు. జగదేక వీరుడు- అతిలోక సుందరి రిలీజ్ రోజు గుర్తు చేస్తూ మే 9వ తేదీ ప్రకటించారు. కానీ ఆ రోజు విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఐపీఎల్ (IPL 2024) సీజన్ ముగిసాక జూన్ 27 వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతోందని తెలుపుతూ.. ఓ కొత్త పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
