సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా 2898 AD మొదటి భాగం భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీని సీక్వెల్ షూటింగ్‌ ఇటీవల మరల ప్రారంభం అయ్యింది. బాలీవుడ్‌ బిగ్ బి అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ ప్రస్తుతం Kalki 2898 AD సీక్వెల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే అమితాబ్ గత ఆదివారం తన ఇంటి ముందు జరిగే అభిమానుల సమావేశానికి హాజరు కాలేకపోయారు. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ ఉండడంతో అభిమానులను కలవలేకపోయినట్టు ఆయన తన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఫోటోలతో పాటు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈసారి సెక్వెల్ సినిమాలో కర్ణుడు, అశ్వత్థామ పాత్రలపై కథ ఎక్కువగా సాగుతుందని ఇప్పటికే తెలిపారు. మొదటి భాగంలో దీపికా పదుకొనే కీలక పాత్రలో కనిపించారు. అయితే సీక్వెల్‌లో ఆమె నటించడంలేదు. మరోవైపు, కమల్ హాసన్ పాత్ర ఈసారి మరింత విస్తృతంగా ఉండనుందని ఆయన ముందే చెప్పారు. నిజానికి గతంలోనే మొదటి భాగం కోసం అనేక సన్నివేశాలు కమల్ ఫై చిత్రీకరించారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *