సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్రంలో నెయ్యి కల్తీ ఫై జరుగుతున్నా వివాదం కొనసాగుతుండగానే.. రాష్ట్రము ప్రజలు పాలులో రసాయనాల కల్తీ ఘటనపై ఒక్కసారి ఉల్లిక్కి పడ్డారు. రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంలో 5గురు మరణించడం అనేక మంది తీవ్ర అనారోగ్యాల తో వారిలో మూత్రం సైతం స్తంభించి ఆసుపత్రి పాలు కావడం సంచలనం రేపుతోంది. ? లాభాల కోసం..ఎక్కువ కూలింగ్ నిల్వ ఉండేలా.. పాలలో ఇథనాల్ గైకోల్ గ్యాస్ హద్దుకు మించి కలవడమే అసలు కారణమని, దీనితో ఆ పాలు విషంగా మారిపోయాయని విచారణలో తేలింది. ఈ ఘటనఫై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ పోలికలను దర్యా ప్తు వేగం గా చేయాలని ఆదేశిం చడం తో అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. తాజాగా ఈ ఘటనలో బాధితుల కుటుంబాలకు పాలు పోసిన వ్యక్తి తప్పు ఒప్పుకోవడంతో కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్‌ని అరెస్ట్ చేసారు. అతడు వరలక్ష్మి డెయిరీ పేరిట అనధికారికం గా 10 ఏళ్లుగా పాలు నిల్వచేందుకు రెండు కూలింగ్ ఛాంబర్లు నిర్వహిస్తున్నాడు. ఆయనకు 125 మంది ఖాతాదారులున్నారు. గత సోమవారం సాయంత్రానికి 64 కుటుం బాల నుంచి రక్త నమూనాలు సేకరిం చి వివిధ పరీక్షలకు పంపించారు. రాజమం డ్రి హాస్పిటల్లో ఉన్నవారు ఇథనాల్ గైకల్ పాలలో కలవడం వల్లే చనిపోయినట్లు ప్రాథమికం గా వైద్యులు నిర్ధారణకు వచ్చారు.
