సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల దేశ రాజకీయాలలో ఆసక్తి రేకేతించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే ఘనవిజయం సాధించారు. ఆయనకు 7,897 ఓట్లు పోలయ్యారు. ఆయన ప్రత్యర్థిగా పోటీలో నిలిచిన శశిథరూర్‌కు 1,000 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించడంతో నేడు, బుధవర్మ ఆయనకు పార్టీ ప్రముఖులు అందరు అభినందనలు ఏఐసీసీ కార్యాలయం బయట సంబరాలు మొదలయ్యాయి.24 ఏళ్ల తర్వాత మొదటిసారిగా నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కానివారు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేకు శశిథరూర్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ”కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *