సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర విభజన తో ఆంధ్ర ప్రదేశ్ కు తీరని ద్రోహం చేసి రాష్ట్రంలో కనుమరుగు అయిపోయిన కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి నేడు, బుధవారం ఢిల్లీలో చేరికపై ? .. పైగా ఆమె తెలంగాణ కు పరిమితం కాకుండా ఏపీ రాజకీయాలలో కీలక రోల్ పోషిస్తారని వార్తలు రావడంతో.. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి నేడు, బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన వైసీపీకి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. తాను వై యస్ జగన్ కు షర్మిలకు రాజీకి మధ్యవర్తితం చేస్తున్నాను అని మీడియాలో వస్తున్నా వార్తలను సుబ్బారెడ్డి ఖండించారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తమకు తోడుగా నిలబతాయన్నారు. అత్యధిక స్థానాలు వైసీపీ గెలుస్తుందని.. జగన్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో బీసీలకు టిక్కెట్ ఇవ్వడం కోసం రామకృష్ణ రెడ్డి కి ఇవ్వలేదన్నారు. అతనికి పార్టీలో మరో మంచి అవకాశం ఇస్తామన్న కూడా.. ఆర్కే మనస్తాపం చెంది బయటకు వెళ్తానంటే వెళ్లనివ్వండని అన్నారు. చాలా చోట్ల టిక్కెట్లు దక్కలేదని వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నారని అది వారి వ్యక్తిగత నిర్ణయం అని .. అలాగే వైసిపి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు 175 స్థానాలలో గెలుపు లక్ష్యంగా నియోజక వర్గల్లో మార్పులు, చేర్పులు ఎన్నికల వరకు సాగుతాయన్నారు.
