సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కన్నడ సినిమా తెలుగు తమిళ, హిందీ వెర్షన్ హోంబేల్ ఫిల్మ్స్ ‘కాంతారా చాప్టర్ 1’ రేపు శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ అవుతోంది.B. అజనీస్ లోక్నాత్ సంగీతంతో రిషబ్ షెట్టి దర్శకుడు, హీరోగా నటించిన ఈ సినిమా, రిలీజ్ అయినప్పటి నుంచి తెలుగునాట కూడా థియేటర్స్‌లో భారీ కలక్షన్లు సాధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇంకా సూపర్ కలెక్షన్స్ వస్తుండగానే , OTTకు ఎందుకు వస్తుందంటే.. కాంతారా చాప్టర్ 1 కో-ప్రొడ్యూసర్, ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకోవడం లేదని అమెజాన్ తో మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒప్పందంలో భాగమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే ₹ 700 కోట్లు పైగా కలెక్ట్ చేసి, 2025 లో ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా అయ్యింది. సినిమాలో రుక్మిణి వాసంత్, జయరామ్, ముఖ్య పాత్రల్లో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *